Nandamuri Balakrishna | సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవంలో భాగంగా హిందూపురంలో ఆర్టీసీ బస్సును నడిపారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. హిందూపురంలో బాలకృష్ణ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీసు వరకు ఆర్టీసీ బస్సును డ్రైవ్ చేశారు. బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపించారు.
ఇదిలా ఉంటే, స్త్రీశక్తి పథకం ప్రారంభానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కూడా ఆ ఆర్టీసీ బస్సులోనే వెళ్లారు. కాగా ఉచిత బస్సు పథకం ప్రారంభం నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హడావుడి చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మార్గం వెంబడి బాణసంచా కాల్చారు. డీజే, తీన్మార్ డ్యాన్సులతో హంగామా చేశారు.
హిందూపురంలో బస్సు నడిపిన #బాలయ్య 🥰❤️🔥
మరో సూపర్ సిక్స్ హామీ, “స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం” ప్రారంభం.
హిందూపురం RTC బస్ స్టేషన్ నుండి చౌడేశ్వరి కాలనీ మీదగా తన నివాసం వరకు బస్సు నడిపిన నందమూరి బాలకృష్ణ గారు. #NandamuriBalakrishna#HindupurMLA pic.twitter.com/MxQdEABYRR
— ʀᴀᴋʜɪ ᵐᵃʰᵃʳᵃᵃʲ ɴʙᴋ ✨️ (@RakhiNbk) August 15, 2025