ఢిల్లీ ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా హిమాన్షు కౌశిక్.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా హిమాన్షు కౌశిక్‌ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్కడ ప్రత్యేక అధికారిగా పనిచేసిన ఎన్వీ రమణారెడ్డిని ఎపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవోగా నియమించారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓగా ఉన్న ఆర్ పవన్‌మూర్తిని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమించారు.
ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడును సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కే సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న రేఖారాణిని కాపు కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

