Vizag Murder Case | విశాఖపట్నం మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని గాజువాక పోలీసులు విచారించడంంతో కొత్త విషయాలు బయటకొచ్చాయి. రవీంద్ర ఫ్లాట్‌లోనే హత్య జరిగిందని ముందుగా అనుకోగా.. స్నేహితుడి ఇంట్లోనే మౌనికను చంపి.. అనంతరం ట్రాలీ బ్యాగులో శవాన్ని తన ఫ్లాట్‌కు తీసుకొచ్చాడని తెలిసింది. ఆ తర్వాత మౌనిక శరీరాన్ని ముక్కలు చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నేవీలో ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ అయిన రవీంద్ర(30)కు 2021లో డేటింగ్ యాప్‌లో తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీకి చెందిన మౌనిక(31) పరిచయమైంది. ఆమెతో స్నేహం కొనసాగిస్తూనే 2024లో రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా మౌనికతో సంబంధం కొనసాగించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలతో మౌనికను ఇటీవల రవీంద్ర చంపేశాడు.
ఈ ఏడాది మార్చి 29న మర్రిపాలెం నుంచి బైక్‌పై తన ఫ్లాట్‌కు తీసుకొచ్చానని.. అక్కడ వాగ్వాదం జరగడంతో చంపేసినట్లు తొలుత రవీంద్ర తెలిపారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరపగా.. ఎల్వీ నగర్‌లోని రవీంద్ర ఫ్లాట్‌కు మౌనిక వచ్చినట్లుగా ఎక్కడా సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. ఫ్లాట్‌లోకి రాకుండానే మౌనిక ఎలా హత్య గురైందనే అనుమానంతో రవీంద్రను విచారించగా అసలు విషయం చెప్పాడు.
హత్య జరిగిన రోజు తన ఫ్లాట్‌కు బదులు స్నేహితుడి ఫ్లాట్‌కి తీసుకెళ్లానని రవీంద్ర చెప్పాడు. ఆ రోజు తన స్నేహితుడు ఉదయం 7 గంటలే విధులకు వెళ్లడంతో అతని ఇంటి తాళాలు తీసుకుని మౌనికను అక్కడికి తీసుకెళ్లాడు. తన ఫ్లాట్‌కు తీసుకెళ్తే పెళ్లయిన విషయం తెలుస్తుందనే ఈ పని చేసినట్లుగా రవీంద్ర తెలిపాడు. అందుకే స్నేహితుడి ఇంటినే తన ఇంటిగా చూపించినట్లుగా పేర్కొన్నారు.
కానీ అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి మౌనిక గట్టిగా అరవడంతో రవీంద్ర ఆమె నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మోకాలితో గొంతుపై బలంగా తొక్కడంతో మౌనిక మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉంచి, తన ఫ్లాట్‌కు వెళ్లి పెద్ద ట్రాలీ బ్యాగ్ తీసుకొచ్చాడు. అందులో మృతదేహాన్ని కుక్కి మళ్లీ తన ఫ్లాట్‌కు వెళ్లాడు.
ఆన్లైన్లో కత్తులు, వైపర్, డస్ట్‌బిన్ కవర్లు కొనుగోలు చేసి బాత్రూంలో మౌనిక చేతులు, తల, శరీరభాగాలను వేరు చేశాడు. అనంతంర వాటిలో కొన్నింటిని జీడితోటలో తగులబెట్టగా.. మరికొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ విషయాలన్నింటినీ రవీంద్ర విచారణలో వెల్లడించాడు. అయితే స్నేహితుడి ఇంట్లోనే చంపేసినట్లు అతనికి తెలియదని రవీంద్ర పేర్కొన్నాడు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో రవీంద్రను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.