Tirumala | వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్లలో రద్దీని నియంత్రించేందుకు టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది.
అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్లో టికెట్లను పొందని భక్తులకు నేరుగా తిరుమల, తిరుపతిలో ఎస్ఎస్డీ టికెట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. జనవరి 10, 11, 12వ తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లను ఏర్పాటు చేసింది. అలాగే స్థానికుల కోసం తిరుమలలో మరో 4 కౌంటర్లు ఏర్పాటు చేసింది.
తిరుపతిలో ఇందిరా మైదానం(15), రామచంద్ర పుష్కరిణి(10), శ్రీనివాసం కాంప్లెక్స్(12), విష్ణునివాసం కాంప్లెక్స్(14), భూదేవి కాంప్లెక్స్(11), భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల(10), ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(8), జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(10), అదేవిధంగా తిరుమల స్థానికుల కోసం తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్(4)లో ఏర్పాట్లు చేసింది. జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టికెట్లను జారీ చేయడం నిలిపివేసింది. ఆ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా దర్శనం చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. కాగా, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో పది రోజుల పాటు ఎలాంటి విశేష దర్శనాలకు భక్తులను అనుమతించరు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన అన్ని దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా ఈ రోజుల్లో అనుమతించరు.
తిరుపతిలొ వైకుంఠ సర్వదర్శనం టొకెన్లు జారి చేసే కౌంటర్ల గూగుల్ లొకేషన్ మ్యాప్స్. 👇
Sri Ramachandra Pushkarini
https://maps.app.goo.gl/km8gANiEC6niRsAY9
Z.P High school, S.N Puram
https://maps.app.goo.gl/Sy5eHKd2FeGsUs8U6
Sri govindarajaswami dormetri
https://goo.gl/maps/bo4rFDcawrie74o56
Mahathma Gandhi Corporation High school (MGMCHS)
https://maps.app.goo.gl/2b57tQEsVFFLCutb6
ZILLA PARISHAD HIGH SCHOOL(ZPHS), M.R.PALLI
https://maps.app.goo.gl/wij1k8fviAAtGA2X7
Z.P High school, S.N Puram
https://maps.app.goo.gl/Sy5eHKd2FeGsUs8U6
Indira Mydanam
https://maps.app.goo.gl/CN1X6rZyeoxgGk916
Srinivasam TTD Book Stall
https://maps.app.goo.gl/NdvhLkBVGTv6B7528