తిరుమల : శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, హంపీ మఠం పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతి (Vidyaranya Bharati) స్వామీజీ శనివారం తన శిష్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రాక సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద టీటీడీ(TTD) జేఈవో వీరబ్రహ్మం, వేదపండితులు ఆలయ మర్యాదతోస్వాగతం పలికారు.
తెలంగాణ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao) స్వామివారిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు సీఎంల మధ్య సన్నిహిత సబంధాలు ఉన్నందున ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల భేటీ ఉండాలని ఆకాంక్షించారు. అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా సమావేశం జరపాలని తెలిపారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 65,775 మంది భక్తులు దర్శించుకోగా 25,126 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.