అమరావతి : ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ( Nimmala Ramanaidu ) మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో చెత్త సీఎం అంటే వైఎస్ జగన్ ( YS Jagan ) అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మళ్లీ రారనే స్పష్టమైన హామీ ఇస్తేనే రాష్ట్రంలో పెట్టుబడులకు ( Investors ) ముందుకు వస్తామని పారిశ్రామికవేత్తలు (Entrepreneurs) పేర్కొన్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్పై విరుచుకు పడ్డారు. నాడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్దమైన వ్యాపారవేత్తలను బెదిరించడంతో ఆయన ఖ్యాతీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని విమర్శించారు.
జగన్ పెండింగ్లో పెట్టిన రూ.1,640 కోట్ల రైతుల ధాన్యం బకాయిలను , రూ.800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ (Fees Reimburment ) బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు . పోలవరం ( Polavaram) నిర్వాసితులకు రూ. వెయ్యి కోట్ల పరిహారాన్ని అందించామని అన్నారు. జగన్ పాలన రాష్ట్రం అన్ని విధాలా వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు.