అమరావతి: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనలను అధికారులు గుంటూరు జిల్లా కొల్లూరు నిలుపుదల చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన భీమ్లానాయక్ సినిమా కొల్లూరులోని ఓ థియేటర్లో ప్రదర్శించాల్సి ఉంది. అయితే ఈ థియేటర్‌కు బీ ఫామ్ లేదని స్థానిక అధికారులు మొత్తం షోలను రద్దు చేశారు.
సినిమాను థియేటర్లో ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని పవన్ అభిమానులు పెట్రోల్ సీసాతో కొల్లూరు బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో వేమూరు-భట్టిప్రోలు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్‌కు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేశారు. ప్రభుత్వం పవన్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.