AP News | మగబిడ్డ పుడితే.. ఆడబిడ్డ అని చెప్పిన వైద్యులు.. నెలరోజుల తర్వాత బయటపడ్డ నిజం!
AP News | మగబిడ్డ పుడితే.. ఆడబిడ్డ పుట్టిందని సమాచారం ఇచ్చారని గుంతకల్లులోని ఓ ఆస్పత్రి నిర్వాకంపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని నెల రోజులపాటు శిశువును చూపించకుండా ఉన్నారని.. చివరకు కర్నూలు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించే సమయంలో మగబిడ్డ అని తేలిందని ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
AP News | మగబిడ్డ పుడితే.. ఆడబిడ్డ పుట్టిందని సమాచారం ఇచ్చారని గుంతకల్లులోని ఓ ఆస్పత్రి నిర్వాకంపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని నెల రోజులపాటు శిశువును చూపించకుండా ఉన్నారని.. చివరకు కర్నూలు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించే సమయంలో మగబిడ్డ అని తేలిందని ఆరోపించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామానికి చెందిన రవిశంకర్, భార్గవి భార్యభర్తలు. ఎనిమిది గర్భిణీ కావడంతో మే 3వ తేదీన ఓ నర్సింగ్ హోమ్‌కు పరీక్షల నిమిత్తం వెళ్లారు. అయితే అక్కడ భార్గవిని పరీక్షించిన వైద్యులు.. ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని, ఇది చాలా ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనంతరం వారికి ఆడబిడ్డ జన్మించిందని భార్గవి తల్లిదండ్రులకు వైద్యులు సమాచారం అందించారు.
పుట్టిన వెంటనే బిడ్డకు అనారోగ్య సమస్య ఉందని, స్థానిక ప్రైవేటు చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఐసీలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత శిశువుకు వాపు ఉందని, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు కుటుంబసభ్యులకు సూచించారు. అప్పటివరకు బిడ్డను తల్లిదండ్రులకు చూపించలేదు. కాగా, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లి వివిధ స్కానింగ్‌లు చేసిన తర్వాత ఆ శిశువు మగబిడ్డ అని తేలింది. దీంతో డెలివరీ అయిన నర్సింగ్ హోం వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. మగ బిడ్డ పుడితే ఆడబిడ్డ అని ఎందుకు తప్పుడు సమాచారమిచ్చారని నిలదీశారు.
అయితే ఈ ఆందోళనపై గుంతకల్లులోని నర్సింగ్ హోం వైద్యుడు రమణ స్పందించారు. ఇందులో తమ నిర్లక్ష్యమేమీ లేదని తెలిపారు. కన్జెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా కారణంగా పుట్టుకతోనే లక్షల్లో ఒకరికి మాత్రమే జననాంగం వృద్ధి చెందకపోవడం వంటి సమస్య వస్తుందని పేర్కొన్నారు. సదరు శిశువుకు సైతం ఇలాంటి సమస్యతోనే జననాంగం వృద్ధి చెందలేదని చెప్పారు. మేనరిక వివాహం కారణంగానే ఇలాంటి సమస్య వచ్చిందని వివరించారు. అయితే ఈ విషయాన్ని ముందే చెప్పకుండా, ఎందుకు తప్పుడు సమాచరాం ఇచ్చారని వైద్యులను శివువు కుటుంబసభ్యులు నిలదీశారు. అయితే ఆందోళన గురించి సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ వంశీకృష్ణ బాధితులకు సర్దిచెప్పి పంపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

