Brahmotsavam | తిరుపతిలో వైభవంగా కొనసాగుతున్న గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
Brahmotsavam | తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం గోవిందరాజస్వామి సింహ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి : తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavam ) మూడో రోజు శనివారం గోవిందరాజస్వామి సింహ వాహనం (Simhavahanam) పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Tirumanjanam) నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్‌సేవ ఘనంగా నిర్వహించారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

