తిరుమల : కర్ణాటక గవర్నర్(Karnataka Governor) థావర్ చంద్ గెహ్లాట్(Thawar Chand Gehlot) బుధవారం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్కు టీటీడీ అడిషనల్ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి ప్రసాదం, టీటీడీ క్యాలెండర్, ఫొటోను అందజేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుమలకు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. రూ. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని 62,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,405 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.