బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల గవర్నర్ సంతాపం
Mourns | టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటుతో మృతి చెందిన సన్నిహితుడి మరణం తీవ్రంగా కలిచి వేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసా’ డని తెలిపారు. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని కొనియాడారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు బాబు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

