అమరావతి: విశాఖలో నిర్మించిన రుషికొండ భవనాల (Rushikonda Buildings) పై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు (Minister Ganta Srinivas rao) తెలిపారు. ఆదివారం రుషికొండ భవనాలు కూటమిశ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్జీటీ ఆదేశాలను పక్కన పెట్టి రుషికొండపై వైసీపీ(YCP) ప్రభుత్వం అడ్డగోలుగా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందని మండిపడ్డారు.
ప్రజాధనంతో నిర్మించిన భవనాలను ఎందుకు ఉపయోగపడుతాయో తెలియడం లేదని ఆరోపించారు. వైసీపీ నేతల ఆక్రమణలు, భూ దోపిడీలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రూ. 91 కోట్ల ఫైవ్‌స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పి, రహస్యంగా విలాస భవనాలు కట్టారని విమర్శించారు. ముందు పర్యాటకం అన్నారు. తర్వాత పరిపాలన భవనాలు అన్నారని వెల్లడించారు. రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని ఏం చేశారని ఆరోపించారు. రుషికొండ భవనాలను చంద్రబాబు (Chandra Babu) కు చూపిస్తామని వెల్లడించారు.