హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2,280 ఎస్జీటీ పోస్టులు, 2,299 స్కూలు అసిస్టెంట్ పోస్టులు, 1,246 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీచేయనున్నట్టు తెలిపారు.
ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్ 7న ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.