Train Derail | విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సంతకాల బ్రిడ్జి సమీపంలో గూడ్స్ రైలు నుంచి మూడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టారు. యుద్ధప్రాతిపదికన ట్రాక్ క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. సాంకేతిక కారణాల కారణంగానే గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లుగా రైల్వే అధికారులు నిర్ధారణకు వచ్చారు.
ఇదిలా ఉంటే ఈ నెల 29, 30వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న విజయనగరం-విశాఖపట్నం (67288), విశాఖపట్నం-పలాస (67289), పలాస-విశాఖపట్నం (67290), విశాఖపట్నం-కోరాపూట్ (58538), బ్రహ్మపుర-విశాఖపట్నం ఎక్స్ప్రెస్(18525), విశాఖపట్నం-దుర్గ్ ఎక్స్ప్రెస్ (18530) రైళ్లను రద్దు చేశారు. ఇక ఈ నెల 30వ తేదీన కోరాపుట్-విశాఖపట్నం ౦ (58537) రైలును రద్దు చేశారు.
#WATCH | Vizianagaram, Andhra Pradesh: A goods train derails at the Vizianagaram Signature Bridge, sending five bogies off the tracks. Support staff, railway officials, and police officers arrive on the scene to clear the derailed wagons. pic.twitter.com/sGfcTRTAEH
— ANI (@ANI) August 29, 2025