తిరుమల : తిరుమల(Tirumala) , తిరుపతి దేవస్థానం పాలకమండలి స్థానికులకు గుడ్న్యూస్ తెలిపింది. టీటీడీ బోర్డు(TTD Board) ఈనెల 18న తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై ప్రతినెల మొదటి మంగళవారం (Tuesday) డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది.
ఇందుల్లో భాగంగా డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో , తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి , రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 62,147 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చిందన్నారు.