అమరావతి : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కాకినాడ – రామకృష్ణారావుపేటలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కొడమాటి సతీష్ రెడ్డి(30) దారుణ హత్యకు గురయ్యాడు. సతీష్ రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరగగా.. ప్రస్తుతం అతని భార్య జయశ్రీ గర్భిణి. కాగా స్నేహితుడైన సాయికిరణ్ ప్రియురాలితో సతీష్ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి భార్యాభర్తలకు మధ్య తరచూ గొడవలు జరగగా.. సాయికిరణ్‌కు జయశ్రీ వివాహేతర సంబంధం గురించి చెప్పింది.
దీంతో స్నేహితుల మధ్య గొడవలు జరగగా.. ఈ క్రమంలో బుధవారం రాత్రి 2 గంటల సమయంలో మరోసారి సతీష్ రెడ్డితో గొడవపడ్డ సాయికిరణ్, అతని స్నేహితులు చెక్క ముక్కతో సతీష్ తలపై బలంగా కొట్టి హతమార్చారు. దీంతో సతీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.