ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘బహుజన బతుకమ్మ’ పాట ఆవిష్కరణ జరుగుతుందని కమిటీ ప్రతినిధులు విమలక్క, కె.లక్ష్మి తెలిపారు. సభకు ప్రొఫెసర్ కస్తూరి లక్ష్మి అధ్యక్షత వహిస్తారని, పాటను ప్రొఫెసర్ మనోజ ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి కవిత్వ వేదిక ‘కవి సంగమం’ నిర్వహణలో ఈనెల 10వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో ‘రెండు తరాల కవి సంగమం’ జరుగుతుందని కవి సంగమం నిర్వాహకుడు కవి యాకూబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్, కొత్తతరం కవులు హాథీరామ్ సభావట్, చిట్ల ప్రేమ్ కుమార్, మామిడిపల్లి ఇంద్రా ణి, విను పాల్గొంటారని తెలిపారు.