అమరావతి : అన్నమయ్య జిల్లా (Annamaiya district) లో జరిగిన దారుణ ఘటనపై పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు (Accused Arrest) చేశారు. నిన్న వీరబల్లి మండలం షికారిపాలెంలో కొండమ్మ అనే వివాహిత భర్త నుంచి విడిపోయి మరో పెళ్లి చేసుకోవడంతో స్థానికులు ఆమెను చెట్టుకు కట్టేసి గుడ్లతో కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్(Video Viral) కావడంతో జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. హుటాహుటినా గ్రామానికి వెళ్లి బాధిత మహిళను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఈ కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.