అమరావతి : ఏపీలోని విజయనగరం(Vizianagaram), కాకినాడ (Kakinada ) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ గ్రామం వద్ద బోల్తా పడ్డ వ్యాన్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో వ్యానులోని ఒకరు మృతి చెందగా , మరో నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా కారు డ్రైవర్(Car Driver) మృతి చెందాడు.
కాకినాడ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కల్పనా సెంటర్లో అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహానాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న పేర్రాజుపేటకు చెందిన పీతా సతీష్(32), అవసరాలవీధికి చెందిన బి.లక్ష్మణ్(32) అక్కడికక్కడే మృతి చెందారు. వారి వెనుక మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జక్కం దుర్గాప్రసాద్(32) తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
AP News | అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త.. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం
MPDO Missing | ఆరు రోజులైనా దొరకని నరసాపురం ఎంపీడీవో ఆచూకీ.. !