MPDO Missing | ఆరు రోజులైనా దొరకని నరసాపురం ఎంపీడీవో ఆచూకీ.. !
MPDO Missing | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించిన పోలీసులు విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాలువలో విస్తృతంగా గాలించారు.
MPDO Missing | నరసాపురం ఎంపీడీవో వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయన అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించిన పోలీసులు విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్న కాలువలో విస్తృతంగా గాలించారు. కానీ మృతదేహం దొరకలేదు. దీంతో అసలు వెంకటరమణరావు కాల్వలో దూకాడా? లేదా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్వలో దూకితే ఇన్ని రోజులుగా మృతదేహం దొరక్కుండా ఉండదని అంటున్నారు.
ఎంపీడీవో మిస్సింగ్ కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంపీడీవో కాల్ డేటాతో పాటు బ్యాంక్ లావాదేవీలనూ పరిశీలిస్తున్నారు. ఆయన సన్నిహితులు, స్నేహితులను కూడా ఆరా తీస్తున్నారు. కాంట్రాక్టర్ వేధింపులే కాకుండా ఇతర కారణాలేమైనా ఉండొచ్చా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
నా పుట్టిన రోజే.. నా చావు రోజు
విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో మండవ వెంకట రమణరావు నివాసం ఉంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి సెలవు పెట్టిన ఆయన.. ఇటీవల కానూరులోని ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాడు. అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్ చేశాడు. నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని మెసేజ్ చేశాడు.
ప్రసాదరాజు అండదండలతో వేధింపులు
అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాసిన సూసైడ్ నోట్‌ను కూడా తన సెల్‌ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు పంపించారు. అందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తట్టుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీడీవో కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

