Road Accident | కొండగట్టు అంజన్నను దర్శించుకుని వెళ్తుండగా.. చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
పల్నాడు: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ఇటీవల కొన్న కారుకు కొండగట్టు అంజన్న ఆలయంలో పూజ చేయించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. బాధితులంతా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

