అమరావతి : డీవోపీటీ ఆదేశాల మేరకు నలుగురు ఐఏఎస్ అధికారులు(IAS Officers ) గురువారం ఏపీలో రిపోర్టు చేశారు. తెలంగాణ హైకోర్టు డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణ నుంచి రిలీవ్ అయిన ఆమ్రపాలి కాట(Amrapali Kata), రోనాల్డ్ రోస్(Ronald Rose), వాణీ ప్రసాద్(Vani Prasad) , వాకాటి కరుణ (Vakati Karuna) ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ను కలిసి రిపోర్టు చేశారు.
మరోవైపు ఏపీ నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారులు సృజన, హరికిరణ్, శివశంకర్‌లు బుధవారమే హదరాబాద్‌కు వచ్చి సీఎస్ శాంతికుమారికి రిపోర్టు చేశారు. కేంద్రం ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాల్సిందేనంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఈ ఉత్తర్వులు ఆపాలని కోరుతూ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు హైకోర్టుకు వెళ్లారు. క్యాట్ ఇచ్చిన ఉత్వర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చిచెప్పడంతో ఆమ్రపాలి కాట, రోనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ ఏపీకి వెళ్లి సీఎస్‌కు రిపోర్టు చేశారు.