ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగిఉన్న కంటైనర్‌ను వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని దవాఖానకు తరలించారు.
మృతులను భాగ్యశ్రీ, కమలాదేవి, నితిన్ కుమార్‌గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ వాసులని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాజవోలు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.