AP News | ఏలూరు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
రైలు ఢీకొనడంతో నలుగురి మృతదేహాలు ఛిద్రమయ్యి.. గుట్టుపట్టలేనంతగా మారిపోయాయి. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని.. వారంతా ఆత్మ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఓ మహిళ మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఇక ఘటనాస్థలిలో ఫోన్లు లభించినప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. ఆ మొబైళ్లలోని సిమ్ కార్డులను వేరే ఫోన్లలో వేసి, మృతులు ఎవరై ఉంటారనే దానిపై ఆరా తీస్తున్నారు.