అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) తెలంగాణపై, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు తీవ్రంగా ఖండించగా తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రాంచంద్రారావు ( KVP Ramachandra Rao ) వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ తనపై తప్పుడు కేసులకు పోలీసులను పురామయిం చాడని ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో స్పందించిన కేవీపీ గురువారం పవన్‌కల్యాణ్‌కు నాలుగు పేజీల లేఖను రాశారు. మీ ఈవేశపూరితమైన, ఆలోచనాభరితమైనా దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. వైఎస్సార్ విషయంలో మీరు సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నానని వెల్లడించారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. రాజకీయ కేసులు బనాయించడానికి ప్రయత్నించారని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు పవన్ కల్యాణ్ ఆరోపించిన విషయంపై సత్యాసత్యాల నిగ్గు తేల్చడానికి ప్రతిపాదనను ముందుంచారు.
మీరు చెప్పిన ఉన్నత పోలీసు అధికారి ఎవరైనా లై డిటెక్టర్ ముందు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి రుజువు చేస్తే వైఎస్సార్ అభిమానులు,తాను కలిసి రూ.10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తానని సవాలు విసిరారు. మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థకు గాని ఇవ్వడానికి సిద్ధమని స్స్టం చేశారు. చేసిన ఆరోపణలు నిజమని మీరు బలంగా నమ్మితే తన చాలెంజ్‌ను అంగీకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆవిర్భావం రోజున జనసభకు అనుమతిని నిరాకరించడం వెనుక సహేతుక కారణాలు తెలుసుకోకుండా కాంగ్రెస్‌ను, రాజశేఖర రెడ్డిని నిందించి ప్రయోజనం లేదని సూచించారు. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని కేవీపీ పేర్కొన్నారు.