Neeraja Reddy | అమరావతి : ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు. ఆదివారం ఆమె హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజి దగ్గర జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్(Car Tyre)పేలి బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటినా ఆమెను కర్నూలు ఆస్పత్రి(Hospital)కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. డ్రైవర్ బాబ్జి (25)కి గాయాలయ్యాయి.
1996లో ఆమె భర్త హత్యకు గురయ్యారు. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే(Mla)గా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడం లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసినా ఆమెకు తగిన గుర్తింపు లేకపోవడంతో ఆమె అధికార పార్టీని వీడి బీజేపీలో చేరారు.