అమరావతి : వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) గతంలో ఎన్నడూ లేని విధంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ( YSR ) ని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు (Tears) . వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఆరోపించారు.
దీంతో మంత్రి వ్యాఖ్యలకు సమాదానమిచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్వేగానికి లోనయ్యారు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మంత్రి అచ్చెన్నాయుడు అహంభావంతో మాట్లాడుతున్నారని, సహనం కోల్పోయి మాట్లాడటం మంచిది కాదని సూచించారు. మావిగన్ గురించి జగన్ మాట్లాడినప్పటి నుంచి చంద్రబాబుకు అదే గుర్తొస్తొందని విమర్శించారు.