Tirumala | గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనం అసంభవమని వ్యాఖ్యనించిన మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం( LV Subramanyam ) పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( TTD Chairman BR Naidu) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీకి ( AI technology) స్వస్తి పలకమని చెప్పడాన్ని ఖండిస్తు న్నట్లు తెలిపారు. ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరమని అన్నారు.
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో సామాన్య భక్తుల సమస్యలపై టీటీడీ దృష్టిని సారించిందని పేర్కొన్నారు. టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని వృథా అనడం సరికాదన్నారు. భక్తులు షెడ్లు, కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాయడం మంచిదా అంటూ ప్రశ్నించారు.
కాగా ఆదివారం ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐ ద్వారా సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లో దర్శనం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా శీఘ్రదర్శనం కష్టమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న విధానానికి మించి శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదని తెలిపారు
తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీటీడీ ధనాన్ని వృథా (Funds wasting ) చేయడం మంచిది కాదని హితవుపలికారు. అమలు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని టీటీడీకి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. దీనికి బదులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించాలని సూచించారు.