అమరావతి : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి మెస్‌లో చపాతి తిన్న విద్యార్థులు అర్ధరాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. పదుల సంఖ్యలో విద్యార్థలు బాధపడుతున్నా సకాలంలో కళాశాల అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది .
అస్వస్థతకు గురైన విద్యార్థులను కొందరిని స్థానికంగా చికిత్స అందించగా మరికొందరిని శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.