కడప : ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడప జిల్లాలోని మైలవరం డ్యామ్‌కు వరద పోటెత్తింది. దీంతో పెన్నానదికి 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదల కారణంగా రోడ్డు, రైలు మార్గాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. కడప – తిరుపతి మధ్య రవాణా కార్యకలాపాలు ఆగిపోయాయి.
అనంతపురం : గౌరిబిదనూరు దగ్గర ఉన్న చెరువు రాత్రి తెగిపోవడంతో పెన్నానదికి నీటిప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కావున పెన్నానది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎవరిని నదీ పరివాహక ప్రాంతానికి దగ్గరలో వెళ్లకుండా చూసుకోవలసినదిగా హిందూపురం తాసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు.
శిథిలావస్థ భవనాలు, పాత ఇళ్లలో ప్రజలు ఉండకుండా పునరావాస కేంద్రాలకు రావాలని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల సమాచారం, చేరడం కోసం స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రదించాలి అని సూచించారు. అత్యవసర పరిస్థితులలో- 100/ 08554275333 కు ఫోన్ చేయాలి అని సూచించారు.
✓మైలవరం డ్యాం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాకు విడుదల…
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 20, 2021
✓రోడ్డు,రైలు మార్గాలు పాక్షికంగా దెబ్బతినడంతో ఆగిన రవాణా వ్యవస్థ.
✓కడప తిరుపతి మధ్య ఆగిపోయిన రైల్,రోడ్డు మార్గాలు. pic.twitter.com/vHZ7kxaJyW