అమరావతి : ఏపీ హోం మంత్రి వంగలపుడి అనిత ( Home Minister Anitha ) కు సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద బల్క్‌డ్రగ్ పార్కు ( Bulk drug park ) కు వ్యతిరేకంగా పదిరోజులుగా అక్కడి జాలర్లు (Fishermen) చేస్తున్న ధర్నా శిబిరం సందర్శనకు వచ్చిన ఆమెను నిలదీశారు. మత్య్సకారులు ఆమె కారుకు అడ్డంగా చెట్లను నరికి పెట్టడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చివరకు వారితో జాలర్లతో మంత్రి చర్చించారు. జాలర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. బల్క్‌డ్రగ్ పార్క్ సమస్యపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చినా మత్స్యకారులు ససేమిరా అంగీకరించలేదు. బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారుల ప్రాణాలకు తీవ్రముప్పు వాటిల్లుతుందని, ప్రాంతమంతా కాలుష్యం అవుతుందని మండిపడ్డారు. పార్క్‌ను కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.