అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా చికిత్సపొందుతూ హనుమంతు ఆసుపత్రిలో మరణించాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులిద్దరు పాత సామానుల వ్యాపారం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.