తిరుపతి: తిరుపతి (Tirupati ) గోవిందరాజస్వామి ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడి ముందుభాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి.
భారీగా మంటలు ఎగసి పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.