Fire Accident | ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. లారస్ యూనిట్-3లో షార్ట్ షర్క్యూట్ జరుగడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ యూనిట్ వద్ద పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కాగా, లారస్ యూనిట్లో పని చేస్తున్న వారిలో నలుగురు మృతి చెందగా, మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. పలువురు ఉద్యోగులు గాయపడినట్లు తెలుస్తున్నది.
ఈ సంగతి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షార్ట్ షర్క్యూట్కు పూర్తి కారణాలు తెలియరాలేదు. అనకాపల్లిలోని వివిధ దవాఖానల నుంచి అంబులెన్స్‌లు ఫార్మాసిటీ యూనిట్ వద్దకు చేరుకుని బాధితులను తరలిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.