తిరుమల : తిరుమలలో ( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లలో నిండి సేవా సదన్ ( Seva sadan ) వరకు క్యూలైన్లోలో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 91,720 మంది భక్తులు దర్శించుకోగా 44,678 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.80 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. కాగా ఆదివారం సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు సుమన్, రాజేంద్రప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.