అమరావతి : కన్నతండ్రే ఆ పిల్లల పాలిట కాలయముడిగా మారాడు. గోరు ముద్దులు తినిపించిన చేతుల తోనే ముగ్గురు పిల్లల ప్రాణాలను తీశాడు. ఏ కష్టమొచ్చిందో తెలియదు కాని కన్న బిడ్డలనే కడతేర్చి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయవిదారకర సంఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా చీమకుర్తి కేవీ అగ్రహారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తన కూతుళ్లు అచ్యుత(11), పూజిత (9), లోహిత (8)లను మార్చాడు.
అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచా రమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే సుధాకర్ ఈ దారుణానికి ఓడిగట్టినట్లు తెలిసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.