అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వి.ఎల్ పురానికి చెందిన పక్కి సత్యకుమార్, తన కుమార్తెలు రిషిత(12), హద్వి (7)లను చెరువులో పడవేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వీరి ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.