అమరావతి : ఏపీలోని మన్యం జిల్లాలో రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం కురిస్తే చాలు వారి కష్టాలు మరింత రెట్టింపవుతున్నాయి. జబ్బుచేస్తే దవాఖానకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా కొమరాడ మండలం రెబ్బ–వనధార గ్రామంలో జ్వరంతో ఉన్న యశ్వంత్ అనే బాలుడిని అతడి తండ్రి భుజాన మోసుకుని 5 కిలోమీటర్లు నడిచివెళ్లిన దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. రోడ్డు మార్గం లేకపోవడంతో వాగులు వంకలు దాటుతూ 5 కిలోమీటర్లు నడిచి కూనేరు హాస్పిటల్కు వైద్యం చేయించాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
రోడ్డు మార్గం లేక జ్వరంతో ఉన్న కొడుకును 5 కిలోమీటర్లు మోసిన తండ్రి
మన్యం జిల్లాలో రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర అవస్థలు
కొమరాడ మండలం రెబ్బ–వనధార గ్రామంలో జ్వరంతో ఉన్న యశ్వంత్ అనే బాలుడిని భుజాన మోసుకుని 5 కిలోమీటర్లు నడిచిన తండ్రి
రోడ్డు మార్గం లేకపోవడంతో వాగులు వంకలు దాటుతూ… pic.twitter.com/sza9K9t2Aw
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026