అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో (Anantapur district ) విషాదం చోటు చేసుకుంది. గుమ్మగుట్ట మండలం కరిసూరయ్య దొడ్డి గ్రామంలో వ్యవసాయ విద్యుత్ మోటార్ దించుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి ( Electrocution ) గురై తండ్రి ఆనంద్ (48), కుమారుడు తేజ ( 25 ) మృతి చెందారు. మృతులు రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి వాసులుగా గుర్తించారు. గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.