అమరావతి: ఏపీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నిన్న లారీ కారుపై బోల్తా పడి 4 గురు చనిపోయిన ఘటనను మరువముందే చిత్తూరు(Chittoor) జిల్లాలో శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accicent) జరిగింది. మొగిలి ఘాట్ వద్ద ఓ బస్సు రెండు లారీలను ఢీకొట్టగా బస్సులో ఉన్న 8 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి.
చిత్తూరు, బెంగళూరు జాతీయ రహదారిపై పలమనేరు నుంచి తిరుపతివైపు వస్తున్న ఆర్టీసీ బస్సును పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. అనంతరం పక్క రోడు నుంచి వెళ్తుతున్న టెంపోవ్యాన్ను లారీ ఢీకొట్టడంతో బస్సు, టెంపోలో ఉన్న ప్రయాణికుల్లో 8 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.