రూ. 15 మద్యం బాటిల్ను రూ. 200 అమ్ముతారా? : బొండా ఉమ
liquor business| ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుందని టీడీపీ నాయకుడు బొండా ఉమ ఆరోపించారు. మద్యం వ్యాపారాన్ని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుందని టీడీపీ నాయకుడు బొండా ఉమ ఆరోపించారు. మద్యం వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రూ. 15 లకే దొరికే మద్యంను రూ. 200కు విక్రయిస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ హయాంలో మద్యం విక్రయాలను పారదర్శకంగా, బహిరంగంగా విక్రయించామని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం బేవరేజెస్ నుంచి ఎంతకు కొంటున్నారో బయటకు రాదని తెలిపారు.
మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపులు కాకుండా నగదు మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్దకు నగదు రూపేణా మొత్తం జమ అవుతుందని వివరించారు. అదాని డిస్టిలరీ రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదని ఈ డిస్టిలరీ ఎవరిదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అదాని కంపెనీ వైసీపీ నాయకులదని , బినామీపేర్లతో కంపెనీని నడిపిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో రసాయనాల శాతం అధికంగా ఉందని ల్యాబ్ రిపోర్ట్ తేల్చి చెప్పిందని వెల్లడించారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం దుకాణాల వేలం బోగస్ అని అన్నారు. విజయవాడలో ముగ్గురు వైసీపీ నాయకులు సిండికేట్గా దుకాణాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

