Tirumala | వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు : టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
Tirumala | వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుమల : వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డిప్యూటేషన్‌పై వచ్చే సంబంధిత అధికారులకు విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ, సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్లు(Que Lines), వైకుంఠం కాంప్లెక్స్‌లు, కంపార్ట్మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు.
భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్ట, సీఆర్వో, పీఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్(Traffic) రద్దీ, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో సీవీఎస్వో నరసింహకిషోర్, సీఈ నాగేశ్వరరావు, తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

