అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ( Inter Exams) హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు (Fees) చెల్లింపు ప్రక్రియను పొడిగించారు. నిన్నటి వరకు చివరి గడువు ఉండగా దీనిని ఈనెల 21వ తేదీవరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి (Board of Intermediate Education) కార్యదర్శి కృతిక శుక్లా ప్రకటన జారీ చేశారు.
డిసెంబర్ 5వ తేదీ వరకు రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. మొదటి , రెండో ఏడాది చదివే విద్యార్ధులు జనరల్ థియరీ సబ్జెక్టులకు రూ. 600, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ. 275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు రూ. 165 చొప్పున ఫీజు చెల్లించాలని సూచించారు.
మొదటి, రెండో ఏడాదికి కలిపి థియరీ పరీక్షలకు రూ. 1200 చెల్లించాలని పేర్కొన్నారు. హాజరు మినహాయింపు కోరేవారు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుందని, వీరు నవంబరు రూ. 1500 ఫీజు చెల్లించాలని తెలిపారు .