తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ( TTD Board Member) దేవాదాయ శాఖ సెక్రటరీ వి.వినయ్ చంద్ ( Vinaychand ) ఆదివారం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. వి.వినయ్ చంద్‌కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,110 మంది భక్తులు దర్శించుకోగా 30,020 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.39 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.