Ernakulam Express | అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి, విశాఖ-లింగంపల్లి, విశాఖ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యమయ్యాయి. వైజాగ్‌కు రావాల్సిన గోదావారి, తిరుపతి-హౌరా కూడా ఆలస్యంగా నడస్తున్నాయి. వందేభారత్, జన్మభూమి సూపర్‌ఫాస్ట్ రైళ్లు వైజాగ్ నుంచి యథావిధిగా బయల్దేరాయి. రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎలమంచిలిలో జనరల్ టికెట్ల జారీని రైల్వే అధికారులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.
ఎర్నాకుళం రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ నంబర్లకు కాల్ చేయడం ద్వారా రైళ్ల సమాచారానికి సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఎలమంచిలి – 78159 09386, అనకాపల్లి – 75693 05669, తుని – 78159 09479, సామర్లకోట – 73826 29990, ఏలూరు – 75693 05268, విజయవాడ – 0866 2575167, రాజమహేంద్రవరం – 0883 2420541/43 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.