Somireddy Chandra Mohan Reddy | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల వచ్చిన వరదలను మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అని ఆయన అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కాబట్టే అది జగన్ మేడ్ మిస్టేక్ అని ఎద్దేవా చేశారు.
వరదల్లో ఏలేరు పొంగి ప్రవహించిందని.. ఒక్కరోజే 17 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని సోమిరెడ్డి అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లే ప్రాణ నష్టం తప్పిందని ఆరోపించారు. జగన్కు క్యూసెక్కులు తెలీదు, టీఎంసీ అంటే తెలియదని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో జగన్ ప్యాలెస్లో కూర్చుండి పాలిస్తే.. జలవనరుల శాఖ మంత్రి డ్యాన్సులకు పరిమితమయ్యారని విమర్శించారు.
ఏలేరు వరద జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన విపత్తే అని అన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు కాలువ డిశ్చార్జి కెపాసిటీని 10 వేల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రూ.292 కోట్లతో చేపట్టిన పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అటకెక్కించారని అన్నారు. అందుకే ఇది ముమ్మాటికీ జగన్ మేడ్ డిజాస్టర్ అని విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి టపాకాయలు కాల్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వరద బాధితులను పరామర్శించేందుకు జగన్ నవ్వుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారని, ముద్దులు పెడుతున్నారని మండిపడ్డారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలబడటంలో చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని దేశమంతా చర్చించుకుంటుందని అన్నారు.
ఏలేరు వరదకు జగనే కారణం. 2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు కాలువ డిశ్చార్జి కెపాసిటినీ 10 వేల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు రూ.292 కోట్లతో చేపట్టిన పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో అటకెక్కించిన ఘనుడు జగనే. ఇది ముమ్మూటికే జగన్ మేడ్ డిజాస్టర్.. @ysjagan pic.twitter.com/BeJmaSoEGS
— Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) September 15, 2024