అమరావతి : ఏపీలోని తిరుపతి ( Tirupati ) జిల్లాలో ఏనుగులు బీభత్సం ( Elephants Attack ) సృష్టించాయి. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బంది ( Forest Stafff ) పై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, సెక్షన్ ఆఫీసర్ మునుస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్‌కు గాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఏనుగులు సమీప గ్రామాలకు వచ్చే అవకాశముందని, ఈ సందర్భంగా ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యలమంద గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.