తిరుమల : టీటీడీ ( TTD )కి బుధవారం విద్యుత్ బస్సు (Electric bus ) విరాళంగా అందింది. చెన్నైకు చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెంకటరమణ్ రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామక్రిష్ణ, తిరుమల డీఐ వెంకటాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా టోకెన్లు ఉన్న భక్తులకు 8 గంటల్లో సర్వదర్శణం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,925 మంది భక్తులు దర్శించుకోగా 21,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.90 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.