అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ( Ebola Virus ) కేసులు పెరుగుతున్న కారణంగా ఏపీ ప్రభుత్వం ( Andhra Pradesh ) అప్రమత్తమయ్యింది. సూడాన్, కాంగో, ఉగాండాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే వారికి వైద్య పరీక్షలు జరుపాలని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల ( Airports ) పై ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించింది.
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులు ఎబోలాపై అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఓడరేవులతో పాటు రోడ్డు మార్గాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
కాగా ఎబోలాకు గురైన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, విపరీతమైన వాంతులు, విరేచనాలు, ముక్కు, నోరు, అంతర్గత అవయవాల నుంచి తీవ్రమైన రక్తస్రావం జరుగుతుందని వివరించారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య ఆఫ్రికాలోని ఉగాండా,కాంగో దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. నమోదైన కేసుల్లో దాదాపు 50 శాతం మరణాలు సంభవిస్తుండడంతో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.