అమరావతి : రానున్న కాలంలో డ్రోన్ టెక్నాలజీ(Drone technology) గేమ్ ఛేంజర్ కానున్నందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu ) పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న మనదేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువాళ్లే ఉన్నారు. మంగళవారం అమరావతిలో డ్రోన్ సమ్మిట్ -2024ను(Drone Sammit) ఆయన ప్రారంభించి స్టాళ్లను పరిశీలించారు.
పౌర విమానయానశాఖ, డీఎఫ్ఐ, సీఐఐ బాగస్వామ్యంతో నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడారు. ఇటీవల విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించామని తెలిపారు. విజయవాడలో వరదలప్పుడు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందించామని వెల్లడించారు. వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. 1995లో తొలిసారి సీఎం అయ్యాక ఐటీపై దృష్టిని సారించానని పేర్కొన్నారు.
ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో భారీతీయు చాలా సమర్థులని అన్నారు. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు , ట్రాఫిక్ సమస్యల నివారణకు డ్రోన్లను వినియోగిస్తామని చంద్రబాబు తెలిపారు. డ్రోన్లతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చని వివరించారునివాస అనుకూల నగరాల్లో దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ (Best City Hyderabad,) అని కొనియాడారు. ఇప్పుడు నిజమైన సంపద అంటే డేటా అని అన్నారు.
డిజిటల్ కరెన్సీ లావాదేవిల్లో ప్రపంచంలో మనమే నెంబర్‌వన్‌గా ఉన్నామని వివరించారు. డేటాసాయంతో ఏఐ, ఎంఎల్ మరింత అభివృద్ధి చెందనున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్న గ్రీన్‌ఫీల్డ్ విమనాశ్రయాలు (Greenfield Airports, ) ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని వెల్లడించారు.. ఈ సమావేశంలో కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.